Customs arrests Air India cabin crew with 1487 grams gold in Kochi
mictv telugu

స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్ ఇండియా ఉద్యోగి

March 9, 2023

Customs arrests Air India cabin crew with 1487 grams gold in Kochi

డబ్బుల కోసం కక్కుర్తి పడి గోల్డ్ స్మ‌గ్లింగ్ చేస్తూ క‌స్ట‌మ్స్ అధికారుల‌కు చిక్కాడు ఓ ఎయిర్ ఇండియా ఉద్యోగి. 1487 గ్రాముల బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించిన అతడిని కస్టమ్స్ అధికారులు కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. వయనాడ్ కు చెందిన పనిచేస్తున్న షఫీ.. బహ్రెయిన్-కోజీకోడ్-కొచ్చి విమానం కేబిన్ క్రూలో పనిచేస్తున్నాడు. బంగారం ఉన్న ప్లాస్టిక్ కవర్లను చేతికి చుట్టుకుని ఫుల్ స్లీవ్స్ కింద దాచి స్మగ్లింగ్ చేయాలనుకున్నాడు. అతడు బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నాడనే పక్కా సమాచారం అందుకున్న అధికారులు.. బుధవారం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగారాన్ని చేతులకు చుట్టి, చొక్కా స్లీవ్‌ను కప్పుకుని గ్రీన్ ఛానల్ గుండా వెళ్లాలని ప్లాన్ చేశాడు. ఈలోపే కస్టమ్స్‌ అధికారులు పట్టేసుకుని.. షఫీ నుంచి 1,487 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మరో ఘటనలో కస్టమ్స్ అధికారులు 6.8 కేజీల బంగారాన్ని అక్రమరవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు విమాన ప్రయాణికులను అరెస్టు చేశారు. సింగపూర్‌ నుంచి వచ్చిన ఆ ఇద్దరినీ చెన్నై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.3.32 కోట్లని తెలిసింది. నిందితులు ఇద్దరు ఎయిర్ ఇండియాకు చెందిన రెండు వేర్వేరు విమానాల్లో వచ్చారని అధికారులు తెలిపారు.