cut note or rupee exchange rule of rbi know
mictv telugu

మీ దగ్గర చిరిగిన నోటు ఉందా, అయితే ఆర్‎బిఐ తాజా నియమం తెలుసుకోండి..!

January 11, 2023

cut note or rupee exchange rule of rbi know

మీ దగ్గర చిరిగిన నోట్లు ఉన్నాయా?అవి చెల్లుబాటు కావని దిగులుపడుతున్నారా? అయితే ఆర్‎బిఐ తీసుకువచ్చని కొత్త నియమాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవల్సిందే. ఎందుకంటే మ్యుటిలేటెడ్ నోట్ల సమస్యకు ఆర్‎బిఐ పరిష్కారం చూపింది. ఆర్‎బిఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం..మ్యుటిలేటెడ్ నోట్లు ఉంటే మీకు సమీపంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ లో వాటిని మార్చుకోవచ్చు.

కరెన్సీ నోట్ల మార్పిడికి ఆర్‎బిఐ మార్గదర్శకాలు
మ్యుటిలేటెడ్ లేదా మురికిగా ఉన్న నోటు, రెండు ముక్కలైన నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయి. ఎలాంటి ఫారమ్ నింపకుండానే ఏదైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లో సులభంగా మార్చుకోవచ్చు. ఆ నోట్ల విలువ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ ద్వారా సంబంధిత బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

చిరిగిన నోట్లను ఎలా మార్చాలి?
1. మ్యలిలేటెడ్ కరెన్సీ నోట్లను మార్చకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లండి.
2. ట్రిపుల్ లాక్ రిసెప్టాకిల్ అనే బాక్సులో దాని విరాలతోపాటు నోట్ ను జమ చేయండి.
3. మ్యుటిలేటెడ్ నోట్లను డిపాజిట్ చేయడానికి, డిపాజిట్ చేసిన నోట్ల పేరు , చిరునామా, బ్యాంక్ అకౌంట్ నెంబర్, డినామినేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
4. తర్వాత అక్కడ డిపాజిట్ చేయండి. మీ చెల్లింపు బ్యాంకు ద్వారా మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది.

నోట్లను డిపాజిట్ చేసేందుకు ఆర్బిఐ షరతులు
నోట్లకు బదులుగా వచ్చిన మొత్తాన్ని దాని విలువ, నష్టం ఆధారంగా నిర్ణయిస్తారు. ఉదాహరణకు 109.56 చ.సె.మీ విస్తీర్ణం కలిగిన రూ.2,000 చిరిగిన నోటు, రూ.2,000 నోటును 44 చదరపు సెం.మీ.ను డిపాజిట్ చేస్తే సగం వాపసు అందిస్తారు. అదేవిధంగా, 88 చదరపు సెంటీమీటర్లకు పూర్తి మార్పిడి రిటర్న్ ఇవ్వబడుతుంది. 78 చదరపు సెంటీమీటర్ల చిరిగిన రూ.200 నోటుకు పూర్తి వాపసు ఇవ్వబడుతుంది. అయితే 39 చదరపు సెంటీమీటర్లకు సగం రిటర్న్ ఇవ్వబడుతుంది.

ఇలాంటి నోట్లను ఆర్‎బీఐ స్వీకరించదు.
పూర్తిగా కాలిపోయిన లేదా పూర్తిగా చిరిగిన నోట్లను బ్యాంకులు స్వీకరించవు. ఉద్దేశ్యపూర్వకంగా చింపిననోట్లు, తారుమారు చేసిన నోట్లను కూడా బ్యాంకుల్లో చెల్లుబాటు కావు.