వివాహేతర విషాదం.. ప్రియురాలిని చంపి తలతో పోలీస్ స్టేషన్‌కు... - MicTv.in - Telugu News
mictv telugu

వివాహేతర విషాదం.. ప్రియురాలిని చంపి తలతో పోలీస్ స్టేషన్‌కు…

September 28, 2018

అక్రమ సంబంధాలు వల్ల కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెళ్లైన ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మరో వ్యక్తితో చనువుగా మాట్లాడుతోందని  కోపంతో ఆమె తలను నరికి, బ్యాగులో పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

ఈ ఘటన కర్ణాటకలోని కంచార్లపల్లిలో జరిగింది. శ్రీనివాసపురం పట్టణానికి చెందిన అజీజ్(27)మొబైల్ షాపును నడుపుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి ఇదివరకే పెళ్లి అయింది. ఈ క్రమంలో అతనికి బెంగళూరుకు చెందిన అయూబ్ ఖాన్ కుతూరు రోషన్ ఖాన్ (24)తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ బాగా అన్యోన్యంగా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. కాగా ఈ మధ్య రోషన్ ఖాన్ వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని  అజీజ్ అనుమానం పెంచుకున్నాడు. కోపంతో రగిలిపోయాడు. తనను కాదని ఇంకొకడితో చనువుగా ఎలా వుంటుందని ఆవేశంతో వూగిపోయాడు. ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.Cut off the girlfriend with the ax and then separate the headఅందుకు ఓ పథకం వేసుకున్నాడు. చింతామణి తాలుకాలో మురగమల్లా దర్గాను దర్శించుకుని వద్దామని నమ్మబలికాడు. దర్గాను దర్శించుకున్న అనంతరం ఆమెను గ్రామ శివార్లలోని మామిడితోటలోని షెడ్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడే అజీజ్ తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో ఆమె  తలను అత్యంత కిరాతకంగా నరికాడు. అనంతరం తలను బ్యాగ్‌లో పెట్టుకుని బైక్‌పై నేరుగా వెళ్లి శ్రీనివాసపురం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.