Home > Featured > శిలాఫలకానికి కేక్ కట్ చేసి బర్త్ డే.. ఎందుకంటే.. 

శిలాఫలకానికి కేక్ కట్ చేసి బర్త్ డే.. ఎందుకంటే.. 

birthday ...

ఈమధ్య కాలంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం ట్రెండ్‌లా మారింది. కొందరు మనుషుల బర్త్ డేలు కాకుండా తాము పెంచుకునే జంతువులు, పక్షుల పుట్టినరోజులు కూడా జరుపుకోవడం చూశాం. కానీ, ఓచోట శిలాఫలకానికి పుట్టినరోజు జరిపారు. కేక్ కట్ చేసి మరీ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. శిలాఫలకానికి పుట్టినరోజు వేడుకలా? ఆశ్చర్యంగా వుంది కదూ. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ఈ విచిత్ర ఘటన జరిగింది. ఇంతకీ ఈ బర్త్ డే ఎందుకు చేశారంటే..

గత ఏడాది మన్నెగూడం-భీమారం మధ్య రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, అప్పటి ఎంపీ వినోద్ కుమార్, మార్క్‌‌ఫెడ్ ఛైర్మన్ బాపురెడ్డి తదితరులు శంకుస్థాపన చేశారు. శిలాఫలకం అయితే వేశారు కానీ, పనులు మాత్రం జరగడం లేదు. దీంతో విసుగెత్తిన గ్రామస్థులు తన నిరసనను పుట్టినరోజు వేడుకగా నిర్విహించారు. రోడ్డు అప్పుడు ఎలాగైతే ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. పైపెచ్చు మరింత అధ్వాన్నంగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యంపై తమ నిరసనను ఇలా సెటబ్రేట్ చేసి చెప్పారు వాళ్లు.

Updated : 31 Aug 2019 8:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top