హీరో నాని తొలిసారి తన కొడుకు అర్జున్ని సోషల్మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేశాడు. ‘అందరికీ హాయ్ చెప్పు అర్జున్’ అంటూ కుమారుడ్ని గుండెలకు హత్తుకుని ముద్దాడుతున్న ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేశాడు. అర్జున్ నాని అభిమానులకే కాదు సమంతకు కూడా తెగ నచ్చేశాడు. నాని పోస్ట్ చేసిన ఫొటోను సమంత తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘ఎంత ముద్దుగా ఉన్నాడో. కంగ్రాట్స్ నాని’ అని ట్వీట్ చేసింది.