Cuts in ministers' salaries in Pakistan have to pay current, water and phone bills
mictv telugu

Pakistan:పాకిస్తాన్‎లో మంత్రుల జీతాల్లో కోతలు..కరెంట్, వాటర్, ఫోన్ బిల్లులు వారే చెల్లించాలి..!!

February 23, 2023

Cuts in ministers' salaries in Pakistan have to pay current, water and phone bills

పాకిస్థాన్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. పేదరికంలో దేశాన్ని నడిపించడం కష్టంగా మారుతోంది. ద్రవ్యోల్బణం దాదాపు 30 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని గిన్నెతో వేడుకుంటున్న పాకిస్థాన్ కు చైనా ఆర్థిక సాయం ప్రకటించింది. అదే సమయంలో, IMF కూడా రుణం ఇవ్వడానికి బదులుగా కఠినమైన షరతులు విధించింది. ఐఎంఎష్ షరతులకు పాకిస్తాన్ తలొగ్గాల్సి వచ్చింది. వీటన్నింటి మధ్య, పాకిస్తాన్ తన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పాకిస్థాన్ మంత్రుల జీతాల్లో కోత పెట్టేందుకు రంగం సిద్దం చేసింది. కరెంటు, నీరు, ఫోన్ బిల్లులు కూడా వారే చెల్లించాలని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అంచనా వేయవచ్చు.

ఇదొక్కటే కాదు ఇతర ఆంక్షలు ఎన్నో విధించింది. మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, సలహాదారులందరికీ జీతం, ఇతర అలవెన్సులు ఇవ్వబోమని ఇస్లామాబాద్ లో విలేకరుల సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అంతేకాదు కేబినెట్ మంత్రులందరి నుండి వారి వాహనాలను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు షాబాజ్ షరీఫ్ చెప్పారు. దీంతో మంత్రికి ఒక సెక్యూరిటీ వాహనం మాత్రమే ఇవ్వనున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దేశానికి తక్షణ సాయం అందించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని షాబాజ్ చెప్పారు. ఈ కొత్త చర్యల ప్రకారం, మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులందరూ తమ జీతాలను తీసుకోకూడదని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారు. దీంతో పాటు టెలిఫోన్, విద్యుత్, నీరు, గ్యాస్, ఇతర వనరుల బిల్లులను మంత్రులందరూ తమ జేబులోంచి చెల్లించాలని డిసైడ్ అయ్యారు.

అంతకుముందు జనవరిలో, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాన్ని 10% తగ్గించాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ పొదుపు కమిటీ ప్రతిపాదించింది. పాకిస్తాన్ ఇప్పుడు తన ఖర్చులను తగ్గించుకోవడానికి మంత్రుల ఖర్చులను తగ్గిస్తుంది. ఇదిలా ఉంటే, ఇటీవలే పాకిస్థాన్ దివాలా తీసిన విషయాన్ని స్వయంగా అంగీకరించిన పాకిస్థాన్ రక్షణ మంత్రి.. ఈ పరిస్థితికి దేశంలోని బ్యూరోక్రాట్లను, రాజకీయ నాయకులను టార్గెట్ చేశారు.