కరాటే కళ్యాణికి సీడబ్ల్యూసీ క్లీన్ చిట్ - MicTv.in - Telugu News
mictv telugu

కరాటే కళ్యాణికి సీడబ్ల్యూసీ క్లీన్ చిట్

May 18, 2022

చిన్నారి దత్తత వ్యవహారంలో సినీ నటి కరాటే కల్యాణికి క్లీన్ చిట్ లభించింది. ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారని ఆమెపై ఆరోపణలు రావడంతో ఆమెను బాలల హక్కుల పరిరక్షణ కమిటీ( చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) విచారణకు రావాలని ఆదేశించింది. ఈ మేరకు చిన్నారి తల్లిదండ్రులతో పాటు కరాటే కల్యాణి కూడా బాలల హక్కుల పరిరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. చిన్నారిని తాను దత్తత తీసుకోలేదని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‎కు ఆమె వివరించారు.

అనంతరం కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. చైల్డ్ వెల్ఫేర్ అధికారుల విచారణ పూర్తయిందని.. అధికారులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు వేసిన వారిపై త్వరలో కోర్టుకు వెళ్తానని చెప్పారు. తాను పాపను దత్తత తీసుకోలేదని.. దత్తత తీసుకుంటే లీగల్‌గానే తీసుకుంటానని అన్నారు. తాను ఎప్పుడు విచారణకు రమ్మన్నా కూడా వస్తానని అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు.