అదరగొడుతున్న భారత వెయిట్‌ లిఫ్టర్లు.. మొత్తం నాలుగు పతకాలు - MicTv.in - Telugu News
mictv telugu

అదరగొడుతున్న భారత వెయిట్‌ లిఫ్టర్లు.. మొత్తం నాలుగు పతకాలు

July 31, 2022

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. రెండో రోజును నాలుగు పతకాలతో ముగించింది. ఏకంగా 4 పతకాలు గెల్చుకుని పతకాల పట్టికలో భారత్‌ను టాప్‌-10లో నిలిపారు. కాగా మహిళల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో 23 ఏళ్ల బింద్యారాణి దేవి భారత్‌కు రజత పతకం గెల్చుకుంది. స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 మొత్తం 202 కేజీలు స్కోర్ చేసిన బింద్యా రాణి భారత్‌ ఖాతాలో నాలుగో పతకాన్ని చేర్చింది. విశేషమేమిటంటే, కామన్వెల్త్ 2022లో ఇప్పటివరకు భారత్‌ గెల్చుకున్న పతకాలన్నీ వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో వచ్చినవే.న

స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను స్వర్ణ పతకాన్ని ముద్దాడగా, 55 కేజీల విభాగంలో సంకేత్‌ మహదేవ్‌ సార్గర్‌ రజతం సాధించగా, 61 కేజీల విభాగంలో గురురాజ్‌ పూజారికి కాస్య పతకం లభించింది. 55 కేజీల విభాగంలో పోటీపడిన బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కేజీలతో మొత్తంగా 202 కేజీలు ఎత్తి రజత పతకం సాధించింది. నైజీరియాకు చెందిన అదిజాత్ ఒలారినోయ్ పసిడి పతకం కొల్లగొట్టింది. బింద్యారాణి కంటే ఒక్క కేజీ ఎక్కువగా 203 కేజీలు ఎత్తిన అదిజాత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు కాంస్యం దక్కింది.