ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో కంప్యూటర్లపై జరిగిన సైబర్ దాడి పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లే సైబర్ దాడులు పెరిగినట్లు మైక్రోసాఫ్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జరిగిన దాడులు ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు మేలుకొలపు కావాలని ఆ సంస్థ తన ప్రకటనలో పేర్కొన్నది. హానికరమైన లోపాలు పెరిగిపోతున్నా, ప్రభుత్వాలు అలాగే తమ డేటాను స్టోర్ చేసుకుంటూ వెళ్లాయని, దాని వల్లే హ్యాకర్లు విజృంభిస్తున్నారని మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. తాజాగా రాన్సమ్వేర్ వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే మైక్రోసాఫ్ట్ విండోస్‌లో లోపాలు ఉన్నాయని, అది తెలుసుకున్న హ్యాకర్లు, అమెరికా ఇంటెలిజెన్స్ శాఖ నుంచి హ్యాకింగ్ టూల్స్‌ను తస్కరించారని మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొంది. సైబర్ దాడుల వల్ల జరిగిన నష్టాలకు ప్రభుత్వాలే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. అమెరికా రక్షణశాఖకు చెందిన తోమాహాక్ మిస్సైళ్లను కూడా హ్యాకర్లు దొంగలించారని తెలిపింది.
వన్నా క్రిప్ట్ లేదా వన్నా క్రై అని పిలిచే వైరల్ సాఫ్ట్‌వేర్‌ను అమెరికాకు చెందిన జాతీయ భద్రతా ఏజెన్సీ అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. శుక్రవారం లండన్‌లో మొదలైన సైబర్ దాడి దాదాపు 150 దేశాలకు పాకింది. దాని వల్ల ఆయా దేశాల్లో సుమారు రెండు లక్షల కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. గత మార్చి నెలలోనే విండోస్ కంప్యూటర్ల రక్షణ కోసం సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశామని, కానీ చాలావరకు కంప్యూటర్లకు ప్యాచ్ చేయలేకపోయాయన్నారు. ప్రభుత్వ లోపాల వల్ల ఎటువంటి సైబర్ దాడులు జరుగుతాయో తెలిసినట్లు మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ తెలిపారు. ప్రభుత్వాల వద్ద ఉన్న డేటా లీక్ కావడం వల్ల ధ్వంసం ఎక్కువగా జరుగుతుందన్నారు.
HACK:
- Microsoft has made sensational remarks that cyber attacks have increased due to government negligence.
- Nearly 2lakhs computers are hacked due to wannacry ransomware virus.