అతనితో బట్టలు విప్పించి మరీ దోచుకుంది..వాట్సాప్ దందా - MicTv.in - Telugu News
mictv telugu

అతనితో బట్టలు విప్పించి మరీ దోచుకుంది..వాట్సాప్ దందా

July 16, 2020

సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. రోజు రోజు కొత్త రకాల సైబర్ కేసులు పోలీస్ స్టేషన్ తలుపు తడుతున్నాయి. అపరిచితులతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకోకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొందరు వినడం లేదు. కొత్త వారితో పరిచయం పెంచుకుని భారీగా నష్ట పోతున్నారు. తాజాగా ఇలాంటి కేసు ఒకటి బెంగళూరులో నమోదైంది. 

ఓ యువకుడికి వాట్సాప్‌లో గుర్తు తెలియని మహిళతో పరిచయం ఏర్పడింది. తాను బెంగళూరులోని ఓ కాల్ సెంటరులో పనిచేస్తానని, తనది కేరళ అంటూ పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. కొన్ని రోజుల తరువాత సన్నిహితంగా మాట్లాడే వరకు వచ్చింది.

దీంతో ఆ మహిళ రోజు వాట్సప్ లో వీడియో కాల్ చేసింది. ఇద్దరూ మాట్లాడుకునే వారు. ఓ రోజు వీడియో కాల్ లో రొమాంటిక్ గా మాట్లాడుతూ ఆ యువకున్ని నగ్నంగా చూడాలని ఉందని తెలిపింది. దీనికి ఆ యువకుడు ఒప్పుకోలేదు. దీంతో మొదట నేను నగ్నంగా కనిపిస్తానని ఆ యువతి చెప్పింది. ఆ యువకుడు సరే అన్నాడు. ఆమె వీడియో కాల్ చేసి మెల్లిగా తన బట్టలు విప్పింది. నువ్ కూడా విప్పు అని అతడిని కోరింది. దీంతో ఆ యువకుడు కూడా నగ్నంగా మారిపోయాడు. ఇద్దరు కొద్దీ సమయం అలా వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. మరుసటి రోజు ఆ యువతి ఆ యువకుడికి షాక్ ఇచ్చింది. మనం నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినప్పుడు దానిని స్క్రీన్ రికార్డ్ చేశానని తెలిపింది. దీంతో ఆ యువకుడు షాక్ కి గురయ్యాడు. ఏం చేయాలో తోచలేదు. ఈలోపు ఆ యువతి యాభై వేల రూపాయలు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వాలని లేకపోతే ఈ న్యూడ్ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించింది. పరువు పోతుందని భయపడిన ఆ యువకుడు తొలుత రూ.22 వేలు ఆ యువతి చెప్పిన ఖాతాకు ఆదివారం ఆన్‌లైన్‌లో బదిలీ చేశాడు. ఇంతటితో అయిపోయిందని అనుకున్నాడు. కానీ, ఆ యువతి మళ్ళీ సోమవారం ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో ఏం చేయాలో తోచక ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.