Cyberabad Commissioner CV Anand revealed about the traffic restrictions
mictv telugu

హైదరాబాద్ : ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ ప్రదేశాలు వెల్లడించిన కమిషనర్

September 8, 2022

Cyberabad Commissioner CV Anand revealed about the traffic restrictions

గణేష్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సిటీ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు లేదా పూర్తిగా ఆపేయడం చేస్తామని పేర్కొన్నారు. నిమజ్జనానికి వచ్చిన లారీలు తిరిగి వెళ్లడానికి ప్రత్యేక రూట్లను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

నిమజ్జనానికి వచ్చే భక్తులు సాధ్యమైనంత వరకు వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణాను వినియోగించాలని సూచించారు. ఈ సమయంలో భారీ వాహనాలు, ప్రైవేటు బస్సులకు నగరంలో అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పార్కింగ్ కోసం ఎంపిక చేసిన స్థలాలను ఆయన వెల్లడించారు. అవి ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ జంక్షన్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీసు వరకు, బుద్ధ భవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, లోయర్ ట్యాంక్ బండ్, గో సేవా సదన్, కట్ట మైసమ్మ టెంపుల్ వరకు వచ్చి అక్కడి నుంచి కాలి నడకన చేరుకోవాలని చెప్పారు. అలు ఆంక్షలు, అవగాహన, సహాయం కోసం ప్రజలు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ 040 – 27852482, 9490598985, 9010203626 లకు ఫోన్ చేయాలని కోరారు. అటు సైబరాబాద్ పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు తెలిపారు.