రేపు సుప్రీం కోర్టు ముందుకు సజ్జనార్  - MicTv.in - Telugu News
mictv telugu

రేపు సుప్రీం కోర్టు ముందుకు సజ్జనార్ 

December 10, 2019

Cyberabad cp sajjanar to attend suprme court in disha case .

బూటకపు ఎన్‌కౌంటర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు సుప్రీం కోర్టు నుంచి పిలుపు అందించింది. రేపు(బుధవారం) ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. దిశ కేసు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చిచంపారని దాఖలైన పిటిషన్‌పై రేపు విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. 

కేసు వివరాలను అందించడానికి సజ్జనార్ ఢిల్లీ వెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో పోలీసులు సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తులు కోర్టులో పిటిషన్లు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, తెలంగాణ డీజీపీని, సజ్జనార్‌‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో విచారణ ముగించిన జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు  బుధవారం తమ సంఘానికి నిజనిర్ధారణ నివేదికను అందజేస్తారు. నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లగా, వారు తమపై దాడి చేయబోయారని, ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరిపామని సజ్జనార్ చెబుతున్న సంగతి విదితమే.