రవిప్రకాశ్, శివాజీలు కనిపిస్తే చెప్పండి..పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

రవిప్రకాశ్, శివాజీలు కనిపిస్తే చెప్పండి..పోలీసులు

May 18, 2019

ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ టీవీ9 అంతర్గత వివాదం కేసులో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. నిందితులైన మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీలకు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంతో తదుపరి చర్యలు చేపట్టారు. వారిద్దరిపై సైబరాబాద్‌ పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

ఫోర్జరీ, ఇతర అక్రమాలకు సంబంధించి కేసులో వీరిద్దరూ విదేశాలకు పారిపోకుండా ఈనోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. విమానాశ్రయాలు, పోర్టుల్లోని సిబ్బందికి వివరాలు తెలిపి అప్రమత్తం చేశామన్నారు. ఏబీసీఎల్‌ పత్రాల ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్‌, శివాజీపై కేసులు నమోదయ్యాయి. టీవీ9ను కొనుగోలు చేసిన అలందా కంపెనీ ఫిర్యాదుపై వీటిని నమోదు చేశారు. విచారణ కోసం తమ ముందుకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్‌, శివాజీ హాజరుకాలేదు. వారిద్దరూ ప్రస్తుతం విజయవాడలోని ఓ కీలక నేత ఇంట్లో ఉన్నారని, ఇప్పటికే వారు విదేశాలకు చెక్కేశారని వార్తలు వస్తున్నాయి.