హైదరాబాద్‌లో డెలివరీ సర్వీసులు ఎక్కువ అయ్యాయి. ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ ఇలా ఎన్నో డెలివరీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నగరంలో డెలివరీ బాయ్‌లు ఎక్కువ అయ్యారు. డెలివరీ బాయ్‌లు ఎక్కువగా ట్రాఫిక్ ఉల్లంగలను చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్‌లు ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Dear @Zomato,
Is this what you teach your executives? pic.twitter.com/hWcI6dae0n
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) September 24, 2020
ఆ వీడియోలో జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ఒకరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానురాజ్యంగా అడ్డదిడ్డంగా యూటర్న్ తీసుకోవడం రికార్డు అయింది. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేస్తూ.. ‘డియర్ జొమాటో.. మీ డెలివరీ బాయ్స్‌కు మీరు ఇదే నేర్పిస్తున్నారా.?’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ట్వీట్‌పై స్పందించిన జొమాటో కేర్..’ఆ బైక్ నెంబర్ లేదా డీటైల్స్ పంపిస్తే.. మా టీమ్‌కు ఫార్వర్డ్ చేస్తామని.. ఈ తప్పు మళ్లీ జరగకుండా చూసుకుంటామని’ రిప్లయ్ ఇచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో సైబరాబాద్ పోలీసులు మంచిగా పనిచేస్తున్నారని కితాబిస్తున్నారు.