New Zealand Cyclone : న్యూజిలాండ్‌లో తుఫాను విధ్వంసం, 11 మంది మృతి, వేలాది మంది గల్లంతు..!! - MicTv.in - Telugu News
mictv telugu

New Zealand Cyclone : న్యూజిలాండ్‌లో తుఫాను విధ్వంసం, 11 మంది మృతి, వేలాది మంది గల్లంతు..!!

February 19, 2023

న్యూజిలాండ్‌లో గాబ్రియెల్ తుఫాను బీభత్సం కొనసాగుతోంది. ఆదివారం నాటికి తుఫాన్ దాటికి మరణించినవారి 11కి చేరింది. దేశంలోని ఉత్తర ద్వీపాన్ని తుఫాను తాకిన వారం తర్వాత, వేలాది మంది మంది ఆచూకీ గల్లంతయ్యింది. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్ గాబ్రియెల్ న్యూజిలాండ్ యొక్క ఈ శతాబ్దపు అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా ప్రకటించారు.

తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న హాక్స్ బే ప్రాంతంలో మరో ఇద్దరు మరణించారని, మృతుల సంఖ్య 11కి పెరిగిందని పోలీసులు తెలిపారు. 5 వేల 608 మంది తెలియలేదన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 62,000 ఇళ్లకు కరెంటు నిలిచిపోయింది. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దేశంలోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌కు పశ్చిమాన 60కిమీ (40 మైళ్ళు) దూరంలో ఉన్న మురివై, పిహా తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితులకు అన్నివిధాల ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు.

సైన్యం హెలికాప్టర్ ద్వారా కీలకమైన సామాగ్రిని తరలిస్తోంది. పొలాలు, వంతెనలు, పశువులు కొట్టుకుపోయాయి. లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. శనివారం దేశవ్యాప్తంగా దాదాపు 62,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వారిలో, దాదాపు 170,000 మంది జనాభాలో 40,000 మంది హాక్స్ బేలో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గాబ్రియెల్ బీభత్సం ఇంకా కొనసాగుతోందని ప్రధాని హిప్కిన్స్ అన్నారు. విపత్తులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉత్తర ద్వీపవాసులు 24 గంటలూ పని చేస్తూనే ఉన్నట్లు వెల్లడించారు.