తెలుగు జనం సంక్రాంతిని ధూంధూంగా చేసుకుంటున్నవేళ మీ అభిమాన మైక్ టీవీ దుమ్మురేపే పాటతో మీ ముందుకొచ్చింది. యంగ్ అండ్ ఎనర్జిటిట్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మామ సూపర్‌గా పాడిన ‘దావత్’ పాట కాసేపటి కిందటే విడుదలైంది. పండగైనా, బ్రేకప్ అయినా, మరే బాధయినా, సంతోషమైనా మనకు దావత్ కచ్చితంగా ఉండాలనే మాస్ అండ్ ఫిలసాఫికల్ లిరిక్స్‌తో సాగే ఈ పాటను జనాన్ని ఊపేస్తోంది..
‘‘దావతు దావతు చలో.. దావతు దావతు
దావతు దావతు చలో.. గమ్మతు దావతు
‘పడపడక పోరి పడి పోరని పరెషన్ విడి
తల్లీ మైసమ్మ గుడి మొక్కీ దావత్ ఇస్తే..
అల్లం ఎలిగడ్డ నూనె గస్సల మస్సాల పొడి
కమురిచ్చిన గా తలకాయ కమ్మగ షోరువ దీసీ
కల్లుతోటి సంపుతుంటే దావతూ..
హే మామ.. కాళ్లు తప్పుతుంటే ఇంకా గమ్మతూ..
కల్లుతోటి సంపుతుంటే దావతూ.. హే మామ
కాళ్లు తప్పుతుంటే ఇంకా గమ్మతూ..
పోరిపడ్డా దావత్ పెళ్లి అయినా దావత్
జాబూగొట్టిన దావత్ జాబువీకిన దావత్..
కాళ్లు తప్పుతుంటే ఇంకా గమ్మతూ..
దావతు దావతు చలో.. దావతు దావతు
దావతు దావతు చలో.. గమ్మతు దావతు’’
అంటూ సాగే దావత్ పాట వీక్షకులకు తమ దావత్ అనుభవాలను గుర్తుకుతెచ్చేదా కనువిందుగా సాగుతుంది. బుల్లెట్ బండి లక్ష్మణ్ రాసిన పాటకు మదీన్ ఎస్కే సంగీతం సమకూర్చారు. ఢీ రాజు కొరియోగ్రఫీ, తిరుపతి డీవోపీ/డైరెక్షన్ అందించగా అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. సంబరానికైనా, బాధకైనా, బ్రేకప్కైనా మరేదానికైనా అచ్చం అతికినట్టు సరిపోపోయే ఈపాటను చూసెయ్యండి మరి…