మున్నా బద్నామ్ హువా.. దబాంగ్3 పాట వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

మున్నా బద్నామ్ హువా.. దబాంగ్3 పాట వచ్చేసింది..

December 2, 2019

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దబాంగ్ 3’. దబాంగ్ సిరీస్‌లో భాగంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సిరీస్‌కు ఒకరుగా దర్శకులు మారుతున్నారు. తాజా చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా ‘మున్నా బద్మాన్‌ హువా డార్లింగ్ తేరేలియే’ అంటూ సాగే ఓ స్పెషల్‌ పాటను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. 

 

దబాంగ్ మొదటి చిత్రంలో ‘మున్నీ బద్నామ్ హువీ డార్లింగ్ తేరేలియే’ అని స్త్రీలింగంలో సాగే పాటను పురుషలింగంలోకి మార్చి పెట్టారు. అప్పట్లో ఈ పాటలో మలైకా అరోరా నర్తించింది. తాజాగా విడుదల అయిన ఈ వీడియో పాటను సోషల్‌మీడియా వేదికగా సల్మాన్‌ అభిమానులతో పంచుకున్నారు. నటి వరీనా హుస్సేన్‌ ఈ పాటలో సల్మాన్‌తో ఆడిపాడారు. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘హుద్‌ హుద్‌ దబాంగ్‌’ పాటపై తీవ్ర దూమారం రేగిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు కాషాయ వస్త్రాలు ధరించి డ్యాన్స్‌ చేశారు. దీంతో ఈ పాట పట్ల ఓ హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా, క్రిస్మస్‌ రోజున (డిసెంబర్‌ 20) ఈసినిమాను విడుదల చేయాలని చిత్ర దర్శకనిర్మాతలు నిర్ణయించారు.