కడుపునిండా తిన్నాడని.. నగ్నంగా నిలబెట్టి, కొట్టి.. - MicTv.in - Telugu News
mictv telugu

కడుపునిండా తిన్నాడని.. నగ్నంగా నిలబెట్టి, కొట్టి..

March 28, 2018

కష్టజీవుల వ్యథలు ఎక్కడైనా ఒకటే. కడుపుకింత తిండి ఉండదు, తలదాచుకోవడానికింత నీడ ఉండదు. కడుపు నిండా తృప్తిగా తిన్నరోజులను లెక్కవేసుకోవాల్సిందే. అయితే పనిమనుషులు కడుపునిండా తినడం కొంతమంది యజమానులకు ఇష్టం వుండదు. వాళ్లు అరకడుపుతో మాడాల్సిందేనని వాళ్ల అభిప్రాయం. హోటల్ కార్మికుడు కడుపునిండా భోంచేశాడని ఓర్చుకోలేక యజమాని అతని బట్టలు విప్పించి అనాగరికంగా ప్రవర్తించాడు. ఈ ఘోరం మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలోని ఓ దాబాలో జరిగింది.

దాబాలో పని చేస్తున్న కార్మికుడు.. బాగా ఆకలి కావడంతో కడుపునించా భోంచేశాడు. దీన్ని చూసిన యజమాని అతని, భాగస్వామి ఓర్చుకోలేకపోయారు. బండబూతులు తిట్టి, బట్టలు విప్పించి నిల్చోబెట్టారు. భౌతిక దాడికి కూడా పాల్పడ్డారు. తప్పయిందయ్యా అని క్షమాపణ చెప్పిన వినిపించుకోలేదు. దాబాకు వచ్చిన వారు ఈ అకృత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందుతులను అరెస్ట్ చేశారు. బాధితుణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.