Dad..even if I am alive or married again: Saipriya
mictv telugu

నాన్న..నేను బతికే ఉన్నా, మరో పెళ్లిచేసుకున్నా: సాయిప్రియ

July 28, 2022

”నాన్న..నేను బతికే ఉన్నా, నేను మరో పెళ్లి చేసుకున్నా, మేము ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. ఒకరిని వదిలి మరొకరం ఉండలేం. అతనేమీ బలవంతంగా నన్ను తీసుకురాలేదు. దయచేసి మా కోసం వెతకొద్దు. ఇక పరిగెత్తే ఓపిక నాకు లేదు. ఇక చావైనా, బతుకైనా అతనితోనే నాకు బతకాలని ఉంది. నా గురించి వెతికితే ఇద్దరం కలిసే చచ్చిపోతాం. నా కోసం వెతికిన అధికారులను క్షమించమని వేడుకుంటున్నా” అని విశాఖ నగరంలోని ఆర్. కె. బీచ్‌ నుంచి ఊహించని విధంగా అదృశ్యమైన వివాహిత (22) సాయిప్రియ బుధవారం రాత్రి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పిన మాటలివి. దాంతో ఆమె తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మూడు రోజుల (ఈ నెల 25) క్రితం విశాఖ నగరంలోని ఆర్. కె. బీచ్‌‌కు పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి బీచ్‌కు వచ్చిన సాయిప్రియ..తన భర్త ఫోన్‌లో నిమగ్నమై ఉండగా ప్రియుడితో కలిసి జంప్ అయిన విషయం తెలిసిందే. దాంతో కలవరం చెందిన సాయిప్రియ పోలసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో అప్రమత్తమైన అధికారులు..రెండు హెలీకాప్టర్లు, 10 మంది గజ ఈతగాళ్లు, రెండు స్పీడ్ బోట్లలో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ తీరం నుంచి సముద్రం వైపు కిలోమీటర్ల మేర హెలీకాప్టర్లలో గాలించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి నెల్లూరులో ఉన్నట్లు సమాచారం అందడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆమె బతికి ఉందా? లేదా? మరో పెళ్లి చేసుకుందా? అనే అనుమానాలు రేకెత్తాయి.

ఈ క్రమంలో బుధవారం రాత్రి అనూహ్యంగా సాయిప్రియ తండ్రికి ఫోన్‌లో ‘నేను క్షేమంగానే ఉన్నాను’ అనే సంక్షిప్త సమాచారం అందించింది. ఆమె నెల్లూరులో ఉన్నట్లు డిప్యూటీ మేయర్ శ్రీధర్ బుధవారం మధ్యాహ్నం ప్రకటించడంతో, పోలీసులు యువతి కుటుంబీకులను విచారించి కొంత సమాచారం రాబట్టారు. దీంతో ఈ కేసులో కొంత స్పష్టత వచ్చింది. బుధవారం రాత్రి మరో పెళ్లి చేసుకున్న చిత్రాలను సాయిప్రియ కుటుంబీకులకు పంపారు. ‘ఆమె విశాఖ నుంచి కావలి, ఆ తరువాత బెంగళూరు వెళ్లింది. మరో వివాహం కూడా చేసుకుంది. త్వరలో విశాఖ వస్తానని కుటుంబీకులకు తెలిపింది’ అని విశాఖ మూడో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ కె. రామారావు పేర్కొన్నారు.