18 అడుగుల పెంపుడు పాము.. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా..  - MicTv.in - Telugu News
mictv telugu

18 అడుగుల పెంపుడు పాము.. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా.. 

November 18, 2019

పిల్లులను, కుక్కలను.. ఇంకా ప్రేమతో తొండలను పెంచుకునే చూశాం. కొందరు పాములను కూడా సాక్కుంటున్నారు. కానీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టబోతున్న 18 అడుగుల కొండ చిలువను ఎవరు పెంచుకుంటారు? అంత పెద్ద పాము చాలా ప్రమాదమే. మనుషులను, ముఖ్యంగా చిన్నపిల్లను గుటకాయ స్వాహా చేసేస్తుంది. కానీ దాని యజమాని మాత్రం అది  మామంచి పాము అంటున్నాడు. అంతేకాదు, అది తన పిల్లలతో సమానమని చెబుతున్నాడు. ఇంట్లో ప్రత్యేకంగా దానికో గదిని కేటాయించి మరీ ఆలనా పాలనా చూస్తున్నాడు. అప్పుడప్పుడు దానిని అడవిలోకి షికారు కూడా తీసుకెళ్తాడు. ఆ పామును తీసుకువచ్చినప్పుడు కేవలం 8 అంగుళాలే ఉండేదని.. ఇప్పుడది 18 అడుగుల పొడవు, 110 కిలోల బరువు పెరిగిందని అంటున్నాడు. 

అతని పేరు మార్కస్ హబ్స్(31). ఇంగ్లాండ్‌లోని ట్యూక్స్‌బరీలో నివసిస్తున్నాడు. ఆ మహాసర్పాన్ని ‘ఇంటి సభ్యుడి’గా  భావిస్తున్న మార్కస్ దానికి ముద్దుగా పెట్టుకున్న పేరు హేస్కియో. ప్రపంచంలో 18.8 అడుగుల కొండ చిలువే అతి పొడవైనది రికార్డుల్లో ఉందని, ఇటీవల హేస్క్సియే పొడవును కొలవగా 8 అడుగులు ఉందన్నాడు. త్వరలో ఇది మరింత పొడవు ఎదిగి.. ఆ రికార్డును చెరిపేస్తుందని భావిస్తున్నానని తెలిపాడు.

ఈ కొండ చిలువ చాలా ప్రమాదకరమైంది.. దాంతో మీరు సావాసం చేయడం ఎప్పటికైనా ప్రమాదమే అని ఇరుగు పొరుగువారు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో పిల్లలను పెట్టుకుని ఆ పాము అవసరమా అని చాలామంది ఆయనను అంటున్నా ఆయన మాత్రం అలాంటిదేం లేదని చాలా తాపీగా సమాధానం చెబుతాడు. తన పిల్లలను దాని దరిదాపుల్లోకి వెళ్లనివ్వనని, పిల్లలకు కూడా దానిని చూపించనని చెబుతున్నాడు. ‘అతి విశ్వాసంతో వదిలేసి ఊహించని ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడం మంచిది కాదు. అది ప్రమాదకరం కాదని భావిస్తే.. నేను బాధ్యత తెలియని యజమాని కింద లెక్క’ అని అన్నాడు. 

రోజూ దానికి కుండేళ్లు, జింక, దుప్పి పిల్లలు, పందులను ఆహారంగా పెడుతుంటానని చెప్పాడు. వీటిని స్థానిక రైతులు సరఫరా చేస్తుంటారని.. ఇది నెలకు ఒకసారి విసర్జిస్తుందని తెలిపాడు. దాన్నంతా పోగేస్తే ఒక బిగ్ బ్యాగ్ అంత ఉంటుంది అని చెప్పాడు.