తిత్లీలో కొట్టుకుపోయిన మానవత్వం.. కూతురు మృతదేహాన్ని మోస్తూ 8 కిలోమీటర్లు - MicTv.in - Telugu News
mictv telugu

తిత్లీలో కొట్టుకుపోయిన మానవత్వం.. కూతురు మృతదేహాన్ని మోస్తూ 8 కిలోమీటర్లు

October 19, 2018

ఇది నిజంగా మనుషులు జీవిస్తున్న లోకమేనా? మన ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేస్తున్నాయా? బతికి ఉన్నప్పుడు ఎలాగూ పట్టించుకోని ప్రభుత్వాలు కనీసం చనిపోయాకైనా స్పందించనంతగా మొద్దుబారిపోయా? వంటి ఎన్నో ప్రశ్నలను లేవదీసే విషాదగాథ ఇది.

trt

తిత్లీ తుపాను దాడిలో కన్నుమూసిన తన బిడ్డను పోస్టు మార్టం కోసం భుజాన మోసుకుంటూ 8 కి.మీ. దూరం నడిచాడో తండ్రి. ఒడిశాలోని గజపతి జిల్లా లక్ష్మీపురం అతంకపూర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ముకుంద్ అనే కటిక నిరుపేద  కూమార్తె బబిత (7) తిత్లీ తుపానులో గల్లంతైంది. మహేంద్రగిరి కొండచరియలు విరిగి పడడంతో చనిపోయిందని పోలీసులు చెప్పారు. అప్పుడే అంత్యక్రియలు పూర్తి చేయాలకున్నాడు తండ్రి. అయితే ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పడంతో  అధికారులకు విషయం చెప్పారు. దీంతో మరో కష్టం ఎదురైంది.

yyy

బబిత మృతదేహానికి పోస్టుమార్టం చేసి, నివేదిక తెస్తేనే పరిహారం అందుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ముకుంద్ పేద కావడం, పైగా తుపాను కష్టాల్లో ఉండడంతో డబ్బుల్లేక సమకూర్చుకోలేకపోయాడు. ఇక చేసేదేమీ లేక పుట్టెడు దు:ఖంతో బిడ్డ నిర్జీవ దేహాన్ని మూటకట్టుకుని భుజంపై మోసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్టులు పోలీసులకు చెప్పడంతో .. ఎట్టకేలకు ఒక ఆటో సమకూర్చారు.

rtt