భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసినందుకు ప్రతిఏడాది ఇచ్చే పురస్కారం దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు. భారతీయ సినిమా పితామహుడిగా భావించే దాదాసాహేబ్ ఫాల్కే శతజన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతిఏడాది ఈ అవార్డులను అందజేస్తున్నారు. వాటిని ఆయా వ్యక్తులకు అందజేస్తుంటారు. అయితే ఆయన పేరుతో పలు చిత్రాలకు కూడా అవార్డులు అందిస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ 2023 అవార్డులను తాజాగా ప్రకటించారు. రణబీర్, అలియాభట్ లు బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్ అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సినిమా అవార్డును వివాదాస్పద ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా సొంతం చేసుకుంది.
ఉత్తమ చిత్రం: ది కాశ్మీర్ ఫైల్స్
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: RRR
ఉత్తమ దర్శకుడు: ఆర్ బాల్కీ చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్
ఉత్తమ నటుడు: రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’: పార్ట్
ఉత్తమ నటి: ‘గంగూబాయి కతియావాడి’కి అలియా భట్
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: ‘కాంతార’ కోసం రిషబ్ శెట్టి
ఉత్తమ వెబ్ సిరీస్ : ‘రుద్ర: ది ఏజ్ ఆఫ్ డార్క్‌నెస్’
విమర్శకుల ఉత్తమ నటుడు: వరుణ్ ధావన్ (భేదియా)
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: ‘అనుపమ’
మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ కోసం అనుపమ్ ఖేర్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: ‘విక్రమ్ వేద’ చిత్రానికి పిఎస్ వినోద్