Daggubati Abhiram starrer Ahimsa movie Glimpses video released
mictv telugu

ఆకట్టుకుంటున్న దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ గ్లింప్స్ వీడియో

September 9, 2022

కొత్త హీరోలు, నటులను సినిమా పరిశ్రమకు పరిచయం చేయడంలో దర్శకుడు తేజ సిద్ధహస్తుడు. నితిన్, ఉదయ్ కిరణ్, నవదీప్, ప్రిన్స్, సదాలతో పాటు పలువురు కమెడియన్లు ఈయన ద్వారా వచ్చినవారే. ఇప్పుడు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కుమారుడు దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అహింస పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఆసక్తికర గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో హీరోను కొందరు వ్యక్తులు ముసుగేసి అడవిలో తీసుకెళ్తుండగా, తప్పించుకోవాలని చూస్తాడు. కానీ, వెంటాడి తిరిగి పట్టుకొని రక్తం వచ్చేలా కొడతారు. ఈ గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేలా ఉంది. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమాలో హీరోకు జోడీగా గీతికా తివారి నటించింది.