ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ట్రాఫిక్ పోలీస్‌గా మారిపోయారు.హైదరాబాద్‌లోని నడిరోడ్డుపై నిల్చొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ‘ఏ బాబు..కాసేపు ఆగు, మీరు ఇక వెళ్లండి ’ అంటూ ట్రాఫిక్‌ను నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఫిల్మ్ నగర్ వద్ద ఇటీవల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అటువైపు వెళ్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు పరిస్థితిని గమనించారు.
వెంటనే కారు దిగిపోయి మరికొంత మందితో కలసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తు చివరికి ట్రాఫిక్‌ను నియంత్రణలోకి తెచ్చారు. చాలా సమయం పాటు అక్కడే నిల్చొని వాహనాలను ముందుకు పంపారు. ఓ ప్రముఖ నిర్మాత వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయడంతో వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సన్నివేశాన్ని కొంతమంది వీడియో తీసి సోసల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. స్థాయిని మరిచి బాధ్యతగల పౌరుడిగా సురేష్‌బాబు వ్యవహరించారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నలుగురికి స్ఫూర్తిగా ఉంటుందని మరికొందరు కామెంట్స్ చేశారు