Dahi Handi Participant sandesh dalvi Died In Mumbai
mictv telugu

కృష్ణాష్టమికి ఉట్టి కొడుతూ జారిపడ్డ యువకుడి మృతి..

August 24, 2022

 

శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా గత శుక్రవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాదిన ప్రజలు ఎక్కువగా ఉట్టి కొడుతుంటారు. మనుషులు పిరమిడ్ ఆకారంలో ఒకరిపై ఒకరు నిలబడి ఎత్తులో ఉన్న ఉట్టిని కర్రలతో పగులకొడుతారు. దీనిని ‘దహీ హండీ’ అని అంటారు. ఈ క్రమంలో ముంబైలో నిర్వహించిన ఓ దహీ హండీ కార్యక్రమంలో 24 ఏళ్ల సందేశ్ దాల్వి ఉట్టికొడుతూ పట్టు తప్పి కింద పడిపోగా, తలకు బలమైన దెబ్బ తగలడంతో సమీపంలోని కూపర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ప్రముఖ హాస్పిటల్ అయిన నానావతికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కాగా, దేశవ్యాప్తంగా ఈ రకంగా కిందపడ్డవారి సంఖ్య 222గా తేలింది. ఇందులో 202 మంది చిన్న గాయాలతో బయటపడగా మిగతా వారి పరిస్థితి విషమంగా ఉంది.