మంత్రి కులకావరం.. దళిత బాలుడితో అమానుషం - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రి కులకావరం.. దళిత బాలుడితో అమానుషం

February 6, 2020

gbbgb

కులవివక్షకు అద్దం పట్టే ఉదంతం ఇది. గౌరవప్రదమైన మంత్రి స్థానంలో ఉన్న అన్నాడీఎంకే నేత.. ఓ దళిత బాలుడితో అమానుషంగా ప్రవర్తించాడు.. ‘ఇలా రా, నా చెప్పులు విప్పు’ అని పబ్లిగ్గా హుకుం జారీచేశాడు. తమిళనాడు అటవీ శాఖ మంత్రి దిండిగల్ సి.శ్రీనివాసన్ గురువారం నీలగిరి జిల్లా మదుమలైలోని ఏనుగుల శిబిరాన్ని సందర్శించినప్పుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. 

ఓ దళిత విద్యార్థిని దగ్గరికి పిలిచిన మంత్రి తన చెప్పులు తీయాలని అతణ్ని ఆదేశించాడు. బాలుడు ఆయన చెప్పినట్లే చేశాడు. తర్వాత మంత్రి అక్కడి గుడిలోకి వెళ్లాడు. ఈ దృశ్యాలు మీడియాలో రావడంతో విపక్షాలు, దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రిని వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.