పటాన్‌చెరులో దారుణం.. దళితులను గర్భగుడిలోకి రానివ్వకుండా..  - MicTv.in - Telugu News
mictv telugu

 పటాన్‌చెరులో దారుణం.. దళితులను గర్భగుడిలోకి రానివ్వకుండా.. 

January 14, 2020

jfbj

కులవివక్ష నేరమని చట్టలు హెచ్చరిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. మారుమూల పల్లెల్లోనే కాకుండా పట్టణాలు, నగరాల్లోనూ ఆ జాడ్యం పాతుకుపోతోంది. పటాన్‌చెరు మండలంలోని రుద్రారం గణేశ్‌ ఆలయంలోని శివాలయం అంతరభాగంలోకి దళితులను ప్రవేశించకుండా అక్కడి పూజారి అడ్డుకున్నాడు. 

దీక్షలో ఉన్న దళిత శివస్వాములు అక్కడ శివాలయంలో ప్రత్యేక పూజలు చేయడానికి వెళ్లారు. వారు గర్భగుడి లోపలికి వెళ్తుండగా పూజారి చంద్రశేఖర్‌ అడ్డుకున్నాడు. తాము దీక్షలో ఉన్నామని, శివుడికి పూజలు చేసే అర్హత తమకుందని స్వాములు చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు.  ఆలయ ఈవోకు ఫోన్ చేశారు. కొంతమంది స్థానిక అగ్రవర్ణాల వారి ఆదేశంతోనే గుడి కార్యకలాపాలు సాగుతున్నాయని, తమపై వివక్ష చూపుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.  ఈ విషయం జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ దృష్టికి కూడా వెళ్లింది. కాగా, శివాలయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని, శివుడు, వినాయకుడు ఉన్న గర్భగుడుల్లోకి పూజారికి తప్ప ఎవరికి అనుమతి ఉండదని ఈవో చెప్పారు.