Dalit family fined Rs 60,000 after boy touches God's idol in Karnataka's Kolar
mictv telugu

దళిత బాలుడు భూతమ్మను తాకాడని రూ. 60 వేల జరిమానా

September 23, 2022

అమ్మవారి విగ్రహాన్ని ఓ దళిత బాలుడు తాకాడని.. అతడి కుటుంబానికి రూ.60 వేలు జరిమానా విధించారు గ్రామ పెద్దలు. జరిమానా చెల్లించకపోతే ఊరి నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని మలూరు తాలుకా హుల్లేరహళ్లిలో ఇటీవల భూతమ్మ దేవర ఉత్సవం జరిగింది. సెప్టెంబరు 7న ఉత్సవం జరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, శోభ దంపతుల కుమారుడు చేతన్.. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తాకాడు. వెంటనే గ్రామపెద్దలు.. పంచాయతీ ఏర్పాటు చేసి బాలుడి కుటుంబానికి రూ.60 వేలు జరిమానా వేశారు. జరిమనా చెల్లించకపోతే గ్రామం నుంచి బహిష్కరిస్తామని తెలిపారు.

అయితే ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత దళిత సంఘాల నాయకులు.. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి సెప్టెంబరు 20న స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..దళిత కుటుంబానికి జరిమానా విధించిన మొత్తం 8 మందిని గ్రామపెద్దలను అరెస్టు చేశారు. అనంతరం భూతమ్మ గుడి తాళం పగలగొట్టి చేతన్ కుటుంబాన్ని ఆలయంలోకి తీసుకెళ్లి ప్రార్థనలు చేయించారు.