దళిత రైతులపై పోలీసుల దాష్టీకం.. - MicTv.in - Telugu News
mictv telugu

దళిత రైతులపై పోలీసుల దాష్టీకం..

July 16, 2020

Dalit farmer attacked in madhya pradesh guna district

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. రాష్ట్రంలోని గుణ జిల్లాలో ఓ దళిత రైతు పండించిన పంటను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేస్తున్నారు. దీంతో ఆ రైతు రెవెన్యూ అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అయినా కూడా ఆ అధికారులు రైతు మాట వినలేదు. 

దీంతో ఆ రైతు పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న పోలీసులు ఆ రైతు కుటుంబంపై దారుణంగా దాడి చేశారు. 5.5 ఎకరాల స్థలంలో ఓ రైతు కుటుంబం పంట పండిస్తున్నది. అయితే ప్రభుత్వం ఆ స్థలాన్ని కాలేజీ నిర్మాణం కోసం కేటాయించింది. దీంతో రైతులకు, ప్రభుత్వానికి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ను తొలగించినట్లు చెప్పారు.