దళిత పెద్దాయనను మూత్రం తాగాలంటూ.. అగ్రవర్ణాల దాడి.. - MicTv.in - Telugu News
mictv telugu

దళిత పెద్దాయనను మూత్రం తాగాలంటూ.. అగ్రవర్ణాల దాడి..

October 13, 2020

Dalit forced to drink urine in uttar pradesh.

హత్రాస్‌లో దళిత బాలికపై జరిగిన హత్యాచార సంఘటనను మరువకముందే ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో రోడా గ్రామంలో మరో దారుణం జరిగింది. కొందరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు మూత్రం తాగాలంటూ ఓ దళిత వృద్ధుడిపై, అతని కుమారుడిపై దాడి చేశారు. అందుకు వారు అంగీకరించక పోవడంతో వారిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అమర్ అనే వృద్ధుడి కుమారుడికి, గ్రామంలోని మరో వ్యక్తికి మధ్య వారం రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ గొడవలో అమర్ కొడుకుపై అవతలి వారు గొడ్డలితో దాడి చేశాడు. 

దీనిపై అమర్‌, అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు వెనక్కి తీసుకోవాలని అమర్ కుటుంబంపై నిందితులు ఒత్తిడి చేస్తున్నారు. కేసు వెనక్కి తీసుకోవడానికి అమర్ కుటుంబం అంగీకరించడం లేదు. దీంతో నినిందితులు అమర్ కుటుంబంపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఒక కప్పులో మూత్రం పట్టి తాగాలంటూ అమర్‌ను బలవంతం చేశారు. దీనిపై అమర్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామని లలిత్‌పూర్ జిల్లా ఎస్పీ మీర్జా మంజర్ బేగ్ తెలిపారు.