Home > Featured > మాజీ గ్రామ పెద్ద అరాచకం.. యూనిఫాం ధరించలేదని దళిత విద్యార్థినిని..

మాజీ గ్రామ పెద్ద అరాచకం.. యూనిఫాం ధరించలేదని దళిత విద్యార్థినిని..


అతను ఆ స్కూల్ హెడ్‌మాస్టర్ కాదు.. కనీసం క్లాస్ టీచర్ కూడా కాదు. పెద్దమనిషినన్న అహంభావంతో స్కూల్‌కి రావడమే కాకుండా.. అక్కడ కొంచెం ఓవరాక్షన్ కూడా చేశాడు. స్కూల్‌కి యూనిఫాం ధరించకుండా వచ్చిందన్న కారణంతో ఓ దళిత విద్యార్థినిని కులం పేరుతో తిట్టాడు. విచక్షణా రహితంగా ఆ బాలికపై చేయి కూడా చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా పాఠశాల నుంచి గెంటేశాడు. ఈ అమానుష సంఘటన యూపీలోని భడోడి జిల్లాలో జరిగింది.

ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక.. సోమవారం యూనిఫాం కాకుండా మామూలు బట్టలు ధరించి స్కూల్‌కి వచ్చింది. ఆ సమయంలో స్కూల్ ఆవరణలో ఉన్న మనోజ్ కుమార్ దుబే అనే గ్రామ మాజీ పెద్ద.. బాలికను యూనిఫాం గురించి అడిగాడు. దీనికి సమాధానంగా బాలిక.. తన తండ్రి యూనిఫాం ఇంకా కొనివ్వలేదని, కొన్న తర్వాత యూనిఫాం ధరిస్తానని చెప్పింది. ఇది విన్న దూబే బాలికను దారుణంగా కొట్టాడని, ఆమెను కులం పేరుతో తిట్టి , పాఠశాల నుండి బయటకు పంపాడని చౌరీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గిరిజా శంకర్ యాదవ్ తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై దాడి, బెదిరింపు, షెడ్యూల్డ్ కులాలు, తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు యాదవ్ తెలిపారు. నిందితుడు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులు మరియు పిల్లలతో అనుచితంగా ప్రవర్తించేవాడని కూడా పోలీసులు తెలిపారు.

Updated : 23 Aug 2022 5:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top