దళిత తల్లి, పిల్లల దారుణ హత్య   - MicTv.in - Telugu News
mictv telugu

దళిత తల్లి, పిల్లల దారుణ హత్య  

November 2, 2017

దేశంలో దళితులపై దాడులు, వివక్షను అరికట్టడానికి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా ఫలితం లేకపోతోంది. తాజాగా గుజరాత్‌లో ఒక దళిత కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. ఒక తల్లిని , ఆమె ముగ్గురు బిడ్డలను పైశాచికంగా హత్య చేశారు.జునాగఢ్ జిల్లా మంగ్రోల్ పట్టణంలో ఈ ఘోరం జరిగింది. మృతదేహాలను వారి ఇంట్లోనే పోలీసులు ఓ సెప్టిక్ ట్యాంకులో కనుగొన్నారు. శారదాబెన్ గోహెల్ (35), ఆమె కొడుకు రుత్విక్ (13), కూతుళ్లు డోలీ(12), నేహా ()లను గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపారు. శారద భర్త ఉదయం పనికి వెళ్లాడని, తర్వాత ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.