రిజర్వేషన్లు, రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర.. దళిత నేతల ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

రిజర్వేషన్లు, రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర.. దళిత నేతల ఆగ్రహం

August 21, 2019

Dalit leaders protest on constitution and reservations issues  ...

 రిజర్వేషన్ల అమలుపై శాంతియుత వాతావరణంలో తప్పనిసరిగా చర్చలు జరగాలని, వాటిని వ్యతిరేకించే వారి వాదనలు కూడా ఓపికగా వినాలని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి కల్పించరే ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేయడానికి కూడా కసరత్తు చేస్తోందనడానికి భాగవత్ వ్యాఖ్యలు సంకేతమని దళిత సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నా యి. ఈ అంశంపై పలువురు దళిత సంఘాల నేతలు బుధవరం హైదరాబాద్‌లోని సోమజిగూడ ప్రెస్ క్లబ్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. 

బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రభుత్వం జాతీయవాదం ముసుగులో రిజర్వేషన్లను రద్దు చేయడానికియత్నిస్తున్నాయని పిడమర్తి రవి, దళిత జేఏసీ బీసీ జనసభ అధ్యక్షడు రాజారామ్ యాదవ్ మండిపడ్డారు. తరతరాలుగా అగ్రవర్ణాల చేతుల్లో దోపిడీ, పీడీనలకు గురైన బడుగు, బలహీన వర్గాలను ఆదుకోడానికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసేందుకు యత్నిస్తున్నారని, తాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు  హక్కులు ప్రసాదించిన రాజ్యంగాన్ని, ప్రజాస్వామ్య న్నీ కాపాడడానికి ప్రాణత్యాగానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు. బీజేపీ, ఆరెస్సెస్ లు ఇలాగే దూకుండా సాగితే భారీ మూల్యం చెల్లించుకుంటాయని అన్నారు.