Dalit man stabbed to death in Karnataka’s Kalaburagi over relationship with Muslim woman
mictv telugu

నాగరాజు హత్య రిపీట్.. కర్ణాటకలో దళిత యువకుడి హత్య..

May 27, 2022

Dalit man stabbed to death in Karnataka’s Kalaburagi over relationship with Muslim woman

దేశంలో ఎక్కడో ఓ చోట పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఓ ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకొని, వారి బంధువుల చేతిలో ఓ యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. అచ్చం అలాంటి ఘటనే క‌ర్ణాట‌క‌లోని కాల‌బురాగి జిల్లాలో చోటు చేసుకుంది. ముస్లిం అమ్మాయిని ప్రేమించాడనే కారణంతో ఓ దళిత యువకుణ్ని అమ్మాయి కుటుంబ స‌భ్యులు దారుణంగా హ‌త్య చేశారు.

జిల్లాలోని భీమాన‌గ‌ర్‌కు చెందిన విజ‌య్ కాంబ్లే(25).. ఓ ముస్లిం యువ‌తిని గ‌త కొంత‌కాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ విష‌యం యువ‌తి సోద‌రుల‌కు తెలియ‌డంతో కాంబ్లేను హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రి మ‌ధ్య సంబంధాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. దీంతో యువ‌తి సోద‌రుడు.. షహబుద్దీన్‌ విజయ్‌పై.. పగ పెంచుకున్నాడు. ఎలాగైనా విజయ్‌ని అంతమొందించాలని మే 25న విజయ్‌కి ఫోన్ చేసి.. మాట్లాడాలని , ఊరి బయటికి పిలిపించాడు. అక్కడ పక్కా ప్లాన్ ప్రకారం.. షహబుద్దీన్‌, అతని స్నేహితుడు నవాజ్ కలిసి.. గ్రామ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి విజయ్ పై దాడి చేశారు. ఆయుధాలు, రాళ్లు, ఇటుకలతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.

స‌మాచారం అందుకున్న విజ‌య్ త‌ల్లి ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని బోరున విల‌పించారు. త‌న కుమారుడిని ముస్లిం యువ‌తి సోద‌రులే హ‌త్య చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాంబ్లేను హ‌త్య చేసిన షాహుద్దీన్, న‌వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్ద‌రితో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.