దళిత యువతిని నడిరోడ్డుపై కాల్చేశారు.. మళ్లీ ఈ దేశంలో పుట్టకు చెల్లీ..! - MicTv.in - Telugu News
mictv telugu

దళిత యువతిని నడిరోడ్డుపై కాల్చేశారు.. మళ్లీ ఈ దేశంలో పుట్టకు చెల్లీ..!

February 23, 2018

దళితులపై యుగయుగాలుగా సాగుతున్న వివక్ష, అవమానాలు, దాడులతో భారతదేశంలో సిగ్గుతో తలదించుకుంటూ వస్తోంది. అంతరిక్ష యాత్రలు చేస్తున్న వర్తమానంలో ఇంకా ఇలాంటి దారుణాలు సాగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట పడకపోతే భరతమాత తన నీచజనాన్ని చూసి ఇక తల కూడా నరికేసుకుంటుందేమో..! ఉత్తరప్రదేశ్ లో గురువారం కొందరు దుర్మార్గులు ఓ దళిత యువతిని నడిరోడ్డుపై పెట్రోలు పోసి తగలబెట్టారు. ఆమె ఆర్తనాదాలు చేస్తూ.. ఈ దేశాన్ని, ఈ లోకాన్ని శపిస్తూ, శఠిస్తూ పంచభూతాల్లో కలసిపోయింది.ఉన్నావ్‌లో 18 ఏళ్ల మోణి సైకిల్‌పై కూరగాయాల మార్కెట్‌కు వెళ్తుండగా సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించారు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. చుట్టూ వందలాది జనం ఉన్నా ఆ ఘాతుకాన్ని అడ్డుకోలేకపోయారు. మోణి ఆర్తనాదాలు చేస్తూ వంద మీటర్ల దూరం పెరిగెత్తింది. శరీరం పూర్తిగా కాలిపోవడంతో కుప్పకూలి చనిపోయింది.