చెన్నై మేయర్‌గా దళిత మహిళ రికార్డులు - MicTv.in - Telugu News
mictv telugu

చెన్నై మేయర్‌గా దళిత మహిళ రికార్డులు

March 5, 2022

8

చెన్నైకి చెందిన 29 ఏళ్ల ఆర్. ప్రియ ఆ నగర మేయర్‌గా ఎన్నికై సంచలనం సృష్టించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ తరపున 74 వార్డు మంగళపురం నుంచి పోటీ చేసిన ప్రియ భారీ మెజార్టీతో గెలుపొందారు. అనంతరం మేయర్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించి ఉండడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రియను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత అత్యధిక మెజార్టీతో మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రియ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. అందులో ఒకటి చిన్న వయస్సులోనే మేయర్ పదవి, రెండోది మేయర్ బాధ్యతలు చేపట్టిన తొలి దళిత మహిళగా రికార్డు నెలకొల్పారు.

అంతేకాక, చెన్నై ఉత్తర ప్రాంతం నుంచి మేయర్‌గా ఎంపికైన తొలి మహిళగా నిలిచారు. ఈ నేపథ్యంలో చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతలు చేపట్టడం పట్ల పలువురు ప్రియను అభినందిస్తున్నారు. కాగా, నగరంలో రోడ్లు, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని ప్రియ తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్కువ శాతం పార్టీ టిక్కెట్లను యువతకే కేటాయించారు. చాలా మంది ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయ వ్యూహంలో భాగంగా రాబోయే 30 ఏళ్లలో పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్టాలిన్ యువతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.