వెనక్కు తగ్గని కంచ ఐలయ్య..! - MicTv.in - Telugu News
mictv telugu

వెనక్కు తగ్గని కంచ ఐలయ్య..!

September 15, 2017

కంచ ఐలయ్య రాసిన ’కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ అనే పుస్తకంపై  వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనిపై కంచె ఐలయ్య స్పందిస్తూ..‘నేను రాసిన బుక్ పై కొందరు బీజేపీ వాల్లు ఆర్య వైశ్య అని పెడితే బాగుంటుందని అన్నారు. నల్ల కోమట్లు అంతా ద్రావిడులే..తెల్లకోమట్లు ఆర్యులు.  ఆర్య జాతీ ఇరాక్ నుంచి వచ్చి భారత లోని పురాతనమైన  హరప్పా, మొహంజోదారో సంస్కృతిని నాశనం చేసారు. దేవాలయాల వద్ద ఆర్యవైశ్య సత్రాలున్నాయి వాటిలో..గోత్రాన్ని కులాన్ని చూసి అనుమతిస్తారు. మనదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని కూడా వారి కులం కాకుంటే  వైశ్య సత్రాల్లో అనుమతి ఉండదు, ఆర్యవైశ్య సత్రాలు బ్లాక్ మని కేంద్రాలు. దేశంలో పాన్ బ్రోకర్ బిజినెస్ ఎవరు చేస్తున్నారు.

దేశ సంపదలో 46% ఆర్యవైశ్యుల చేతిలో ఉంది. వారి పరిశ్రమల్లో,వ్యాపారాల్లో  5% ఉద్యోగాలిస్తే వారిపై రాసిన పుస్తకము పేరు మార్చుతా, ఆ పుస్తకం యొక్క పేరును ’సామాజిక సర్వర్లు, వైశ్యులు’ గా మారుస్తా. బీజేపీకి ఆర్యవైశ్యులు ఇస్తున్న విరాళం లో 5% రైతులకిస్తే రైతు ఆత్మహత్యలే ఉండవు. ఆర్యవైశ్య ప్రతినిధులు నేను రాసిన పుస్తకము పేరు మార్చాలని సిపియం నేత తమ్మినేని వద్దకు రావడాన్ని స్వాగతిస్తున్న. కూకట్ పల్లి లో ఆర్యవైశ్యుడు జగదీష్.. ఇంట్లో కిరాయికుండే వారి అబ్బాయి చనిపోతే శవాన్ని ఇంట్లోనికి రానివ్వకపోవడాన్ని ఎలాచూస్తారు? దీనికి బీజేపీ వాల్లు సమాధానం చెప్పాలి. నా డిమాండ్లకు ఆర్యవైశ్యులు ఆంగీకరించి అమలు చేస్తే సుందరయ్య విగ్రహం కాల్లముందు నా పుస్తకాలు తగలబెడుతా, నేను అసహజంగా మరణిస్తే దానికి ఆర్యవైశ్య యువకులే కారణం. అని ఐలయ్య అన్నారు.