దళితుడి హత్య.. నిందితులందరూ నిర్దోషులంట! - MicTv.in - Telugu News
mictv telugu

దళితుడి హత్య.. నిందితులందరూ నిర్దోషులంట!

November 24, 2017

మూడేళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలం సృష్టించి దళిత విద్యార్థి దారుణ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడింది. అగ్రవర్ణానికి చెందిన మొత్తం 9 మందీ నిర్దోషులని మహారాష్ట్రలోని అహ్మద్ నగర్  జిల్లా సెషన్స్ కోర్టు గురువారం విడుదల చేసింది. వీరికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేవని  పేర్కొంది.  అయితే పోలీసులు, అగ్రవర్ణాల వారు బెదిరించడంతో సాక్షులు మాట మార్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నా బిడ్డను ఎవరూ చంపకపోతే ఎలా చనిపోయాడు?.. వాడంతకు వాడే చంపుకున్నాడా? మరి వాడిది హత్యే అని డాక్టర్లు తేల్చారుగా.. మా వాడిని ఎవరు చంపారు? మాకు సమాధానం కావాలి’ అని ప్రశ్నిస్తున్నారు.2014లో  ఖార్దా గ్రామానికి చెందిన నితిన్ ఆగే అనే 17 ఏళ్ల దళిత విద్యార్థిని అగ్రవర్ణాల వారు దారుణంగా చంపారు. మొదట ఇటుకలబట్టీ వద్దకు తీసుకెళ్లి చిత్రవధ చేశారు. తర్వాత చెట్టుకు ఉరివేసి చంపారు. నితిన్.. తన గ్రామానికి చెందిన ఒక అగ్రవర్ణ టీనేజ్ అమ్మాయిని ప్రేమించాడనే కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాలిక బంధువులే తమ కొడుకును చంపారని నితిన్ తల్లిదండ్రులు కేసు పెట్టారు.