ఎస్టీ,ఎస్టీలను ఫోన్‌లో దూషించినా నేరమే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్టీ,ఎస్టీలను ఫోన్‌లో దూషించినా నేరమే..

November 20, 2017

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. వారిపై దాడులకూ తెరపడ్డం లేదు. వారికి రక్షణ కల్పిస్తున్న ఎస్సీ, ఎస్టీపై అత్యాచారాల నిరోధక చట్టంలోని కొన్ని లోపాలను సాకుగా తీసుకుని కొందరు వారిని వేధిస్తున్నారు. వారిని బహిరంగంగా దూషిస్తే నేరం కనుక ఫోన్లలో తిడుతున్నారు. బాధితులు బయటికి చెప్పుకోలేరనే ధైర్యంతో బూతుల పర్వానికి తెరతీస్తున్నారు. అయితే ఇక వారి ఆగడాలు చెల్లవు. ఎస్టీ, ఎస్సీలను ఫోన్లో దూషించినా నేరమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి.. ఒక దళిత మహిళను ఫోన్లో దూషించాడు. దీంతో ఆమె కోర్టుకు వెళ్లింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఎస్‌) ప్రకారం ఈ వర్గాల బహిరంగ ప్రదేశంలో తిడితేనే నేరమని, తాను ఫోన్లో తిట్టాను కనుక నేరం కాదని నిందితుడు చెప్పుకొచ్చాడు. అతని వాదనను కోర్టు తోసిపుచ్చింది. అతడు బహిరంగ ప్రదేశంలో తిట్టలేదన నిరూపించుకోవాలని పేర్కొంది. అయితే ఈ తీర్పుపైనా విమర్శలు వస్తున్నాయి. బహిరంగంగా అయినా, ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఫోన్లలో దళితులను దూషించినా నేరంగా పరిగణించాలనే డిమాండ్లు వస్తున్నాయి.