ముగ్గురు దళితుల్ని కాల్చిచంపాడు.. వీడింకా దొరకలేదా? - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురు దళితుల్ని కాల్చిచంపాడు.. వీడింకా దొరకలేదా?

April 3, 2018

సోమవారం భారత్ బంద్ సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతా బలగాలకు, దళితులకు మధ్య జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 10మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ముగ్గురిని రాజాసింగ్ చౌహాన్ అనే దుండగుడు చంపినట్లు భావిస్తున్నారు. గ్వాలియర్‌లో అతడు కాల్పులు జరుపుతున్న వీడియోలు బయటికొచ్చాయి. దొంగచాటుగా కాల్పులు జరిపి, ఆ నేరాన్ని దళితులపై నెట్టేయడానికి అతడు యత్నించినట్లు తెలుస్తోంది.రాజాసింగ్ గ్వాలియర్‌లో రౌడీ అని తెలుస్తోంది. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రాజాసింగ్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలే అతణ్ని దాచారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ,ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేలా సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును నిరసిస్తూ దళిత సంఘాలు బంద్ చేయడం తెలిసిందే.