రాసలీలల వీడియో.. బీజేపీ నేత రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

రాసలీలల వీడియో.. బీజేపీ నేత రాజీనామా

November 21, 2019

రాసలీలల వీడియో వైరల్ కావడంతో డయ్యూ డామన్ బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ కూడా అయిన గోపాల్ టాండెల్ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు  రాజీనామా లేఖను అందించడంతో దానికి ఆమోదం తెలిపారు. గోపాల్ టాండెల్ ఓ మహిళతో అభ్యంతరకరమైన రీతిలో కనిపించారు. 36 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారింది. దీంతో ఆయనపై పలువురు విమర్శలు గుప్పించారు.

BJP President Gopal Tandel

 దీనిపై గోపాల్ టాండెల్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పార్టీలోని కొంత మంది వ్యక్తులే ఫొటోలు మార్ఫింగ్ చేశారని పేర్కొన్నారు. మరోసారి అధ్యక్ష పదవి రాకూడదనే కక్షతోనే ఇలా చేశారని ఆరోపించారు. కొంత మంది దీనిని పాత వీడియో అంటుండగా మరికొంత మంది మాత్రం హనీట్రాప్ కేసుగా అభివర్ణిస్తున్నారు. గతంలో ఆయన ఎంపీగా పనిచేశారు. అప్పట్లో కాంగ్రెస్, ఎన్సీపీలలో కూడా చురుకుగా పని చేసితర్వాత బీజేపీలో చేరి డయ్యూ డామన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.