Dancing and injured Manchu Vishnu..Thanks too
mictv telugu

డ్యాన్స్ చేస్తూ, గాయపడ్డ మంచు విష్ణు..థ్యాంక్స్ కూడా

September 1, 2022

టాలీవుడ్ క్రేజీ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు సంబంధించిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోటోలను చూస్తుంటే, షూటింగ్ సెట్‏లో ఆయన గాయపడినట్లుగా తెలుస్తుంది. అయితే, ఈ ఘటనపై మంచు విష్ణు తన ఇన్‌స్టా స్టోరీలో పిక్‌ను షేర్ చేస్తూ, గాయానికి సంబంధించిన వివరణ ఇచ్చారు.

”జిన్నా’ సినిమా షూటింగ్‌లో ఓ సాంగ్‌కి డాన్స్ చేస్తుండగా, కాలికి గాయం అయింది. ఈ సాంగ్‌కి ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. పాటకి ఆయన పలు కఠినమైన స్టెప్స్ వేయిస్తున్నారు. అయినా చాలా ఆనందంగా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్స్ ప్రేమ్ రక్షిత్. రెండు వారాలపాటు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు” అని ఆయన రాసుకొచ్చారు.

ఇక, మంచు విష్ణు విషయానికొస్తే.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన వరుస సినిమాలతో ముందుకెళ్తున్నాడు. ఇటీవలే ‘మోసగాడు’ సినిమాతో ఆయన ఆడియన్స్ ముందుకు వచ్చారు. కానీ, ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన జిన్నా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సన్నిలియోన్, రాజ్ పుత్ పాయల్ కథానాయికలుగా నటిస్తున్నారు.