చెలరేగిన డాన్సింగ్ అంకుల్.. ఏకంగా ఆల్బమ్‌తో - MicTv.in - Telugu News
mictv telugu

చెలరేగిన డాన్సింగ్ అంకుల్.. ఏకంగా ఆల్బమ్‌తో

March 14, 2019

డ్యాన్సింగ్ అంకుల్ కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాను షేక్ చేసిన పేరు ఇది. సంజీవ్ శ్రీవాస్తవ అనే వ్యక్తి తన బావమరిది పెళ్లిలో డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 50 సంవత్సరాలు ఉండే ఆ అంకుల్ వేసిన స్టెప్పులను చూసి యువత కూడా అవాక్కయింది. అయితే డాన్సింగ్ అంకుల్ మరోసారి సంచలనం సృష్టించారు.

ఇప్పటివరకు సినిమా పాటలకు డాన్స్ చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న శ్రీవాస్తవ ఇప్పుడు తనపైనే చిత్రీకరించిన ఆల్బం సాంగ్‌కు అదిరిపోయే రేంజ్‌లో స్టెప్పులేశారు. యూఏఈలో ఉండే మ్యూజిక్ కంపోజర్ జాసిమ్, ఇండియన్ సింగర్ బెన్నీ దయాళ్ సంయుక్తంగా రూపొందించిన చాచా నాచ్ అనే పాటలో ఈ డ్యాన్సింగ్ అంకుల్ అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శన చేశారు. ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సాంగ్‌లో సంజీవ్ శ్రీవాస్తవ డ్యాన్స్ టాలెంట్ పీక్స్‌లో కనిపించింది. అక్కడ్నించి సామాజిక మాధ్యమాల్లో డాన్సింగ్ అంకుల్ పేరుతోనే పాప్యులర్ అయ్యాడు. సంజీవ్ శ్రీవాస్తవ ఓ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.