ప్రమోషన్ లో దడ రేపిన ‘ దండుపాళ్యం 2 ’ అయినా సినిమా తుస్సు ! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రమోషన్ లో దడ రేపిన ‘ దండుపాళ్యం 2 ’ అయినా సినిమా తుస్సు !

July 22, 2017

సినిమా ప్రమోషన్ కోసం ఎంతటి దారుణానికైనా తెగించేలాగా తయారైంది పరిస్థితి ? తమ సినిమా వీడియోలను తామే లీక్ చేస్కొని కొత్త దారుల్లో ప్రమోషన్ కోసం పాకులాడుతున్నారు.
సినిమా రిలీజ్ కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేయడమేంటో ? ‘ దండుపాళ్యం 2 ’ సినిమా ప్రమోషన్ వీడియోలు యూట్యూబ్ లో వాళ్ళనుకున్నట్టు సెన్సేషన్ క్రియేట్ అయిందేమో ? సంజన నగ్నంగా వున్న దృశ్యాలు, అలాగే నటి పూజాగాంధీ మీద పోలీస్ అధికారి సెక్సువల్ హరాస్ మెంట్ వంటివి చూడటానికి చాలా ఇబ్బందికి గురి చేసాయి.

సెన్సార్ వాళ్ళు ఆ సీన్స్ ను కట్ చెయ్యటంతో వాటినిలా ప్రమోషన్ కు వాడుకున్నట్టున్నారు. కానీ సినిమా సక్సెస్ లో అవి ఏ మాత్రం ఉపయోగ పడలేకపోయాయి. యూట్యూబులో వున్న వీడియోలు చాలా వరకు సెన్సార్ కత్తెరకు కట్ అయిపోయాయి ?
ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలను చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 2012 లో వచ్చిన ఫస్ట్ పార్ట్ కు కొనసాగింపుగా వచ్చింది ఈ సెకెండ్ పార్ట్. అయితే ఇందులో దండుపాళ్యం గ్రూపుకు ఉరిశిక్ష విధిస్తారు. ఒక రిపోర్టర్ చొరవతో వాళ్ళకు, జరిగిన హత్యలకు సంబంధం లేదని తెలిసి ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తుంది. తర్వాత పోలీసుల అకృత్యాలు బయట పడతాయి. చివరికి వాళ్ళు ఆ నరకం లాంటి జైలు నుండి తప్పించుకున్నారా లేదా, అనేది క్లైమాక్స్ లో థర్డ్ పార్టుకు వదిలేసాడు ? ఈ సంవత్సరమే థర్ఢ్ పార్ట్ వుంటుందని కన్ క్లూజన్ ఇచ్చాడు దర్శకుడు శ్రీనివాసరాజు.

టూకీగా వున్న ఈ కథకు లేని లేనివి, చూడనివి, ఎబ్బెట్టుగా వున్న బోలెడు మసాలాలను అద్ది ఈ సినిమా తీసినట్టు అనిపించింది. ఆడవాళ్ళను పక్కా అంగడి సరుకు కన్నా హీనంగా చూపించేసారు. ఎంత రియలిస్టిక్ గా తీసినా చూసే కంటికి చాలా ఇబ్బందిగా వున్నాయి. సమాజంలో ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు వున్నారు, వాళ్ళు చేసే థర్డ్ డిగ్రీ ఇలాగే వుంటుందని మరీ అంత కర్కషంగా చూపించిన సీన్స్ ను యూట్యూబ్ లో చూస్తుంటే వామ్మోయ్ అన్పిస్తోంది !? ఈ టైపాఫ్ జోనర్ నచ్చేవారికి ఈ సినిమా నచ్చుతుంది అంతే !

https://www.youtube.com/watch?v=75C7jixydKY

https://www.youtube.com/watch?v=OLizzTcLuDw