చైనాలో దంగల్ రికార్డుల మోత
Editor | 17 May 2017 6:18 AM GMT
ఇండియన్ సినిమాకు 2017వ సంవత్సరం గ్రేట్ ఇయర్ అని చెప్పవచ్చు. ఈ ఏడాదిలో విడుదలైన బాహుబలి2, దంగల్ చిత్రాలు ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇండియన్ సినిమా గొప్పతనాన్ని చాటాయి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రం 1500 కోట్ల కలెక్షన్స్ మార్కు చేరుకునేందుకు ఉరకలు పెడుతుంటే, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన దంగల్ చిత్రం చైనాలో 450 కోట్ల వసూళ్ళు రాబట్టి మన ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది.
ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ చైనాలో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించలేదని చెబుతున్నారు. దంగల్ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్లు సాధించనుందని అంటున్నారు. రెజ్లర్ మహావీర్ ఫోగాట్, ఆయన ఇద్దరు కూతుళ్ల నిజ జీవితం ఆధారంగా దంగల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
HACK:
- Ameer Khan movie Dangal has set a record as the first Indian movie which got highest range collections around 450 crores in China.
Updated : 25 May 2018 4:28 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire