అత్తమీది కోపం దుత్తమీద  తీయడం అంటే ఇదే... - MicTv.in - Telugu News
mictv telugu

అత్తమీది కోపం దుత్తమీద  తీయడం అంటే ఇదే…

August 10, 2017

అత్తమీది కోపం దుత్త మీద తీయడం అంటే ఇదే గావొచ్చు. తమ అభిమాన హీరో సిన్మ ఎట్లా ఉందో ఓ రిపోర్టర్ సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు వల్గర్ కామెంట్లు పెట్టారు సదరు హీరో అభిమానులు.  సిన్మా బాగుంటే  ఇలాంటి పోస్టింగ్ లు ఎందుకు పెడ్తారనే  ఆలోచనే లేనట్లుంది ఫ్యాన్స్ కు. ఈ అభిమానపు గత్తర ఇప్పట్ల పోయేటట్లే లేదు.

విషయంలోకి వద్దాం…. బెంగుళూరుకు చెందిన ధన్యరాజేంద్ర అనే రిపోర్టర్ షారూక్ ఖాన్ నటించిన ’’జబ్ హ్యారీ మెట్ సీజల్ ‘‘ మూవీకి వెళ్లారు. ఆ సిన్మ ఇంటర్వెల్ కాకుండానే బయటకు వచ్చారు. తన ఫీలింగ్ ను  ట్వీటర్ లో రాస్తూ గతంలో విజయ్ సిన్మా  ’’సురా‘‘కు వెళ్లినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ ఉందని రాసింది. అంతే ఆమె పైకి  విజయ్ అభిమానులు  ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు రాతలు  రాశారు. వెకిలి కూతలు రాతల్లో చూపించారు. దీనిపై రాజేంద్రన్  పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొందరు ఫ్యాన్స్ తమ అకౌంట్లు డిలిట్ చేశారట. అయినా చదువుకున్న వారు…. మంచి చెడు తెల్సుకోలేనంత  అభిమానపు అంధకారంలో మునిగిపోతే ఎట్లా…. పరమ చెత్త సిన్మాలు తీసి జనం మీద వదిలే కంటే మంచి  సిన్మాలు తక్వ తీసినా ఇబ్బంది ఉండదు కదా.