ప్రజా గాయకుడు డప్పు రమేశ్ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజా గాయకుడు డప్పు రమేశ్ కన్నుమూత

March 18, 2022

hfh

నాలుగు దశాబ్దాల పాటు తన గొంతును, దరువును ప్రజా పోరాటాల కోసమే అంకింత చేసిన ప్రజా గాయకుడు, డప్పు కళాకారుడు డప్పు రమేశ్ ఇకలేరు. ఆయన వయసు 60 ఏళ్లు. శ్వాసకోశాల సమస్యతో ఆయన శుక్రవారం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా జూలకల్లు గ్రామంలో శనివారం ఆయన అంత్యక్రియలు జరగుతాయి.

నక్సలైట్ ఉద్యమ ప్రభావంతో సాంస్కృతిక రంగంలోకి దూకిన రమేశ్ ప్రజల కష్టాలను, కన్నీళ్లను ఉద్వేగభరితంగా పాడేవారు. స్వయంగా డప్పు కొడుతూ తెలుగు ప్రాంతాలన్నింటా తిరగేవారు. జననాట్యమండలిలో చురుగ్గా పాల్గొన్న ఆయన ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా’, ‘ఒరే ఒరే కూలన్న ఇంక లేవరో’, ‘భారతదేశం భాగ్యసీమరా, పాడిపంటలకు కొదవలేదురా’ వంటి ప్రజా గీతాలను అద్భుతంగా పాడేవారు. రమేశ్ కొన్నాళ్లు హైదరాబాద్ లో నివాసం ఉన్నారు. అరెస్టులు, కేసులు ఎదుర్కొన్నారు పలువురు రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖులు ఆయన మృతికి నివాళి అర్పిస్తున్నారు.