రజినీకి షాక్.. దర్బార్ టీవీ చానల్లో వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

రజినీకి షాక్.. దర్బార్ టీవీ చానల్లో వచ్చేసింది..

January 13, 2020

Darbar.

‘దర్బార్‌’ సినిమా దర్శక నిర్మాతలకు షాక్ తగిలింది. సినిమా విడుదలై నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే టీవీలో ప్రసారమైంది. శరణ్య టీవీ ఛానెల్‌ అక్రమంగా సినిమా పైరసీ వెర్షన్‌ను మదురైలో జనవరి 12న ప్రసారం చేసింది. దీనిపై చిత్ర నిర్మాతలు, సదరు టీవీ ఛానెల్‌పై కేసు పెట్టారు. సినిమా విడుదల అయి నాలుగు రోజులు కూడా గడవక ముందే టీవీలో ఎలా ప్రసారం చేస్తారని? తమిళ చిత్ర పరిశ్రమకు నష్టం చేకూరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఛానెల్‌ నిర్వాహకులు ఇంకా స్పందించలేదు.

అంతకుముందు కొందరు ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్‌ను వాట్సాప్‌లో షేర్‌ చేశారు. లింక్‌ను అందరికీ షేర్‌ చేయమని.. ఓ వాయిస్‌ ద్వారా చెప్పారు. అంతలోనే ఇలా మళ్లీ తమ సినిమా టీవీలో ప్రసారం అవడంతో దర్శక నిర్మాతలు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు. 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. నయనతార కథానాయికగా నటించింది. జనవరి 9న విడుదల అయిన ఈ సినిమా హిట్ టాక్‌ అందుకుంది. సినిమా తొలి వారాంతంలో రూ.128 కోట్లు వసూలు చేసిందని బాక్సాఫీస్ విశ్లేషకులు అంటున్నారు.