వీధిలో కుక్కలు కనిపిస్తే పిల్లలు దడుసుకుంటారు. అటు వైపు పోవాలంటేనే భయపడుతారు.వాటిని చూసి ఇంట్లోపడేదా పరుగెత్తుతారు. కానీ ఓ బుడ్డోడు ఏం చేశాడో తెలుసా. బాహుబలి రేంజ్ లో కాకపోయినా..జెమ్స్ బాండ్ రేంజ్ లో కుక్కల్ని తరిమికొట్టాడు.ఎలాగంటే…
అది హైదరాబాద్ లోని ముసాపేటలో అజయ్ నగర్. రాత్రి పూట ఆ వీధిలో ఇద్దరు చిన్నారులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో కనిపించిన కుక్కల్ని ఓ చిన్నారి ఉరుకితే..మరో బుడ్డోడు అక్కడ నుంచి అడుగు కదల్లేదు. వాడు ఏమాత్రం భయపడకుండా రౌండ్ప్ చేసిన కుక్కల్ని రఫ్ ఆడించాడు.జేమ్స్ బాండ్ లెవల్లో ఫోజులు ఇవ్వడంతో కుక్కలు తోక ముడిచాయి. ఆ వీడియో ను మీరూ చూసేయండి.