డార్లింగ్ నీకోసం ఎదైనా చేస్తా:రాజమౌళి - MicTv.in - Telugu News
mictv telugu

డార్లింగ్ నీకోసం ఎదైనా చేస్తా:రాజమౌళి

March 10, 2022

04

‘నువ్వు నా డార్లింగ్‌వి, నీకోసం ఏదైనా చేస్తా’ అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. తాజాగా ప్రభాస్ కథనాయకుడిగా, పూజ హెగ్డే కథనాయికగా తెరకెక్కిన చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్‌లో బీజీగా బీజీగా ఉంది. ఈ తరుణంలో రాజమౌళి సైతం ప్రభాస్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

ఇటీవలే ప్రభాస్‌తో కలిసి రాజమౌళి ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఇంటర్వూలో ప్రభాస్ – జక్కన్న మధ్య జరిగిన సంభాషణ, ప్రభాస్‌పై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. నిజానికి వీళ్ళిద్దరిదీ బాహుబలి ఫ్రెండ్‌షిప్, పైగా ఒకరంటే ఇంకొకరికి చాలా ఇష్టం కూడా. రికార్డులు తిరగరాసిన కాంబో కూడా ఇదే. అయితే జక్కన్నతో ఉన్న సాన్నిహిత్యంతో ప్రభాస్ నేరుగా ఆయనని ఓ ప్రశ్న అడిగారు. రాధేశ్యామ్ సినిమాను మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారనే ప్రశ్న వేశారు.

దీంతో వెంటనే రియాక్ట్ అయిన రాజమౌళి.. ‘నువ్వు నా డార్లింగ్, నీకోసం ఏదైనా చేస్తాన’ అని అనేశారు. ఈ సమాధానంతో ప్రభాస్- రాజమౌళి బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అనేది మరోసారి స్పష్టమైంది. జక్కన్న చెప్పిన ఈ ఆన్సర్ రెబల్ స్టార్ అభిమానులను ఫిదా చేయడంతో పాటు రాజమౌళిపై ఉన్న ఇష్టాన్ని రెట్టింపు చేసింది.

మరోపక్క ‘రాధే శ్యామ్’ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు సినిమా హాల్స్ ముందు భారీ కటౌట్లు, పెక్ల్సీల ఏర్పాట్లు చేస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా భారీ రేంజ్‌లో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.